పూరి మార్క్ రామ్ ఎలా ఉండబోతున్నాడు?

Tuesday,May 14,2019 - 10:02 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ లో రామ్ ఎలా కనిపించబోతున్నాడనేది అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు రామ్ సినిమాలు ఓ లెక్క..ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ ఓ లెక్క.. అనేంతలా రామ్ లుక్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అయితే లుక్స్ వరకు ఓకె… పూరి మార్క్ హీరోగా ఈ సినిమాలో రామ్ మేనరిజమ్స్ ఎలా ఉండబోతున్నాయి?

పూరి హీరోలంటేనే హై ఎండ్ అగ్రెసివ్ యాటిట్యూడ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి తన ప్రతి సినిమాతో హీరోలకు డిఫరెంట్ మేనరిజమ్స్ ఇస్తూనే ఉన్నాడు పూరి. పూరి కథ ఎంత కొత్తగా ఉంటుందో, హీరో క్యారెక్టర్ కూడా అదే రేంజ్ లో నెవర్ సీన్ బిఫోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఫోకస్ మొత్తం ఈ ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ పై పడింది.

మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, నాగార్జున, ఎన్టీఆర్.. ఇలా ఒకరేంటి దాదాపు హీరోలంతా పూరి దర్శకత్వంలో విలక్షణంగా కనిపించారు. డిఫరెంట్ మేనరిజమ్స్ తో అదరగొట్టారు. ఇప్పుడు రామ్ వంతు వచ్చింది. ఈ ఎనర్జిటిక్ హీరో ఎలాంటి మేనరిజమ్స్ తో దుమ్ముదులపబోతున్నాడో మరో 24 గంటల్లో తేలిపోతుంది.