రేపట్నుంచి అసలైన ఇస్మార్ట్ సందడి

Tuesday,June 18,2019 - 12:11 by Z_CLU

ఇప్పటివరకు విడుదలైన 2 పాటలు ఒకెత్తు. రేపు రిలీజ్ కాబోతున్న సింగిల్ మరో ఎత్తు. అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి రేపు టైటిల్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. రేపు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఈ పాట సోషల్ మీడియాలో లాంచ్ అవ్వనుంది.

హీరోయిజంను పీక్ స్టేజ్ లో చూపించే పూరి జగన్నాధ్, హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ కు స్పెషలిస్ట్ అనిపించుకున్నాడు. పోకిరి, ఏక్ నిరంజన్, బుజ్జిగాడు, బిజినెస్ మేన్.. ఇలా ఎన్నో సినిమాల్లో పూరి క్రియేట్ చేసిన ఇంట్రో సాంగ్స్ దుమ్ముదులిపాయి. ఇప్పుడు వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా రాబోతోంది ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్.

నిజానికి ఈ టైటిల్ సాంగ్ ట్యూన్ ఎలా ఉండబోతోందనే విషయంపై ఈపాటికి ఆడియన్స్ కు ఓ ఐడియా ఉంది. ఇస్మార్ట్ శంకర్ టీజర్ లో ఈ ట్యూన్ ను బ్యాక్ డ్రాప్ లో కొద్దిగా వినిపించారు. ఇప్పుడు అదే పాటను ఫుల్ లిరికల్ వీడియోగా రేపు లాంచ్ చేయబోతున్నారు.

ఎనర్జిటిక్ స్టార్ నుంచి మోస్ట్ ఎనర్జిటిక్ సాంగ్ అన్నమాట. మణిశర్మ ఈ పాటను కంపోజ్ చేశాడు.