ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ అదిరింది

Wednesday,June 19,2019 - 05:42 by Z_CLU

టైటిల్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో పూరి-మణిశర్మది తిరుగులేని కాంబినేషన్. ఈ కాంబినేషన్ లో ఇప్పుడు మరో అల్టిమేట్ సాంగ్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ రిలీజైంది. పూరి స్టయిల్ లో, మణిశర్మ మేజిక్ తో వచ్చిన ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపుతోంది.

పూరి-మణి కాంబోలో వచ్చిన టైటిల్ సాంగ్స్ ఏవీ డిసప్పాయింట్ చేయలేదు. ఇప్పుడొచ్చిన ఇస్మార్ శంకర్ టైటిల్ సాంగ్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఇస్మార్ట్ శంకర్ భాషలో చెప్పాలంటే కిర్రాక్ ఉంది పాట.

భాస్కరబట్ల రాసిన క్యాచీ పదాలకు, మెలొడీ బ్రహ్మ ట్రెండీ బీట్ ఇచ్చాడు. అనురాగ్ కులకర్ణి అంటే టెంపోతో పాడాడు ఈ పాటని. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ మిక్సింగ్ అదిరిపోయింది.

సినిమాకు సంబంధించి ఇప్పటివరకు రిలీజైన పాటల్లో ఇది మూడోది. త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ మరోర 2 సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 12న విడుదల చేయబోతున్నారు