పూరి మార్క్ హీరో.. ఇస్మార్ట్ శంకర్ టీజర్ రివ్యూ

Wednesday,May 15,2019 - 11:12 by Z_CLU

పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అప్పటివరకు ఆ హీరో నటించిన సినిమాలు వేరు. పూరి దర్శకత్వంలో చేసిన ఆ ఒక్క సినిమా వేరు. అంత ఎట్రాక్టివ్ మేకోవర్, స్పెషల్ మేనరిజమ్స్ కనిపిస్తాయి పూరి హీరోలో. ఫస్ట్ టైమ్ ఈ దర్శకుడితో వర్క్ చేస్తున్న రామ్ కూడా ఈసారి అంతే స్పెషల్ గా కనిపించాడు.

రామ్ బర్త్ డే బొనాంజాగా ఇస్మార్ట్ శంకర్ టీజర్ రిలీజైంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సరికొత్త రామ్ ను చూడబోతున్నారు ఆడియన్స్. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ టీజర్. అసలే ఎనర్జిటిక్ స్టార్. దానికి తోడు పూరి జగన్నాధ్ ఫ్రేమింగ్. ఇంకేముంది ఇస్మార్ట్ శంకర్ టీజర్ అదిరిపోయింది.

టీజర్ లో ప్రతి ఫ్రేమ్ మాస్ అనిపించుకుంది. దీనికి తోడు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విజువల్ ను మరింత మాస్ గా మార్చేసింది. టీజర్ లోనే థీమ్ సాంగ్ కూడా చొప్పించారు. ఆ పాట కూడా బాగుంది. పూర్తిగా రామ్ మేకోవర్, మేనరిజమ్స్ ను ఎలివేట్ చేసే విధంగా కట్ అయిన ఈ టీజర్ అనుకున్న టార్గెట్ రీచ్ అయింది.