ఈ సక్సెస్ ని నా ఫ్యాన్స్ కి డెడికేట్ చేస్తున్నాను

Sunday,August 04,2019 - 09:30 by Z_CLU

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర స‌త్తా చాటుతూ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచి రూ.75 కోట్ల గ్రాస్‌ను సాధించింది. ఈ సందర్భంగా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ “సినిమా చూసాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూసాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉండేలా ఓ సినిమా చేయాలనుకుంటున్న టైం లో సరిగ్గా పూరి గారు కలిసారు. ఆయన కూడా అలాంటే సినిమా చేయాలనుకోవడం ఇద్దరి టెస్ట్ కలవడం ఈ సినిమా సెట్ అయింది. బ్యాడ్ బాయ్ కి ఓ లవ్ స్టోరీ ఉంటే బాగుంటుందని ఇద్దరం ఫీలయ్యి ఈ సినిమా చేసాం. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసినందుకు పూరి గారికి థాంక్స్. మణిశర్మ గారి సంగీతం హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్ కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు టెక్నీషియన్స్ కు థాంక్స్. హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా నన్ను నమ్మి వెంటే ఉంటూ మా వాడొస్తాడు.. అనుకున్న నా ఫ్యాన్స్ అందరికీ ఈ సక్సెస్ ను డెడికేట్ చేస్తున్నాను.” అని తెలిపాడు.