`ఇస్మార్ట్ శంక‌ర్` రిలీజ్ డేట్ ఫిక్స్

Sunday,May 26,2019 - 02:55 by Z_CLU

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో ఫస్ట్ టైమ్ రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డబుల్ దిమాక్ హైద‌ర‌బాదీ` ట్యాగ్ లైన్‌. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ చిత్రాన్ని జూలై 12న విడుద‌ల‌ చేస్తున్నారు.

పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లై ఔట్ స్టాండ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. టైటిల్ రోల్‌లో న‌టించిన రామ్ టెరిఫిక్ షో చేశాడ‌ని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

ఇక షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే, మూడు పాట‌ల షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ పాట‌ల‌ను హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేసి చిత్రీక‌రించ‌బోతున్నారు. నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.