రేపట్నుంచి మళ్లీ ఇస్మార్ట్ హంగామా

Thursday,September 26,2019 - 11:53 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ హంగామా ముగిసింది. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక త్వరలోనే జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రానుంది. అయితే ఈ గ్యాప్ లో మరో హంగామా స్టార్ట్ చేసింది ఈ సినిమా. అవును.. ఇస్మార్ట్ శంకర్ సినిమా మరోసారి థియేటర్లలోకి రానుంది.

ప్రేక్షకుల కోరిక మేరకు, పూరి జగన్నాధ్ బర్త్ డే స్పెషల్ గా రేపట్నుంచి మరోసారి థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను ప్రదర్శించబోతున్నారు. రేపట్నుంచి ఆదివారం వరకు తెలుగు రాష్ట్రాల్లోని సెలక్టెడ్ లొకేషన్సలో ఇస్మార్ట్ శంకర్ సినిమాను రీ-రిలీజ్ చేయబోతున్నారు.

నైజాంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, కాజీపేట్ లో చెరొక థియేటర్ లో ఇస్మార్ట్ శంకర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్ పట్టణాల్లో చెరొక థియేటర్ లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇలా షార్ట్ గ్యాప్ లో మరోసారి థియేటర్లలోకి తీసుకురావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా ఓ సినిమాను ఇలా మరోసారి థియేటర్లలోకి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైమ్. ఇందులో కూడా పూరి తన మార్క్ చూపించుకున్నాడు. ఈ సినిమా మరోసారి థియేటర్లలోకి రావడంతో.. ఆయా లొకేషన్లలో గద్దలకొండ గణేశ్ వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.