‘ఇస్మార్ట్’ శంకర్ – రామ్ కి ఇదే ఫస్ట్ టైమ్

Tuesday,July 02,2019 - 12:41 by Z_CLU

‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ కరియర్ లో స్పెషల్ గా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ సినిమాలో రామ్ గతంలో ఎప్పుడూ చేయనంత డిఫెరెంట్ రోల్ లో కనిపించబోతున్నాడు. దానికి తోడు ఈ సినిమాలో రామ్ గతంలో చేయని కాంబినేషన్స్ కుదిరాయి… ఇవన్నీ రామ్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్.

 

రామ్ – పూరి కాంబినేషన్ : ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ డిమాండ్ లో ఉన్న కాంబినేషన్ ఇది. ఇన్నాళ్ళకు కుదిరింది. ఈ సినిమాలో పూరి మార్క్ తో చాలా డిఫెరెంట్ గా కనిపించబోతున్నాడు రామ్. లుక్స్ దగ్గరి నుండి క్యారెక్టరైజేషన్ వరకు ప్రతీది స్పెషలే అనిపించుకోనుంది.

రామ్ – ఇద్దరు హీరోయిన్స్ : రామ గతంలో కూడా ఇద్దరు హీరోయిన్స్ తో జోడీ కట్టాడు కానీ నభా నతేష్, నిధి అగర్వాల్ తో జత కట్టడం మాత్రం ఫస్ట్ టైమ్. ఇప్పటికే వీళ్ళ కెమిస్ట్రీ సోషల్ మీడియాలో హీట్ జెనేరేట్ చేస్తుంది.ఈ ఫ్రెష్ సిజిలింగ్ కాంబినేషన్స్ పై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి.

రామ్ – మణిశర్మ : ఈ కాంబినేషన్ కూడా రామ్ కరియర్ లో ఫస్ట్ టైమే. గతంలో హైపర్,  ఒంగోలు గిత్త సినిమాలకు మణిశర్మ పని చేసినా, జస్ట్ BGM ఇచ్చాడు… ఈ సినిమాకి సాంగ్స్ కూడా కంపోజ్ చేశాడు. ఇప్పటికే ఆడియో బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. మిగిలింది విజువలైజేషనే…

సైన్స్ ఫిక్షన్ – చాలా డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. రామ్ తన కరియర్ లో ఎప్పుడూ సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్.

జూలై రిలీజ్ : జూలై 18 న రిలీజవుతుంది ఇస్మార్ట్ శంకర్. ఇది కూడా ఫస్ట్ టైమ్ ఎలిమెంటే… ఇప్పటి వరకు రామ్ నటించిన ఏ సినిమా జూలైలో రిలీజ్ కాలేదు.