ఇస్మార్ట్ శంకర్ మూవీ అప్ డేట్స్

Wednesday,May 15,2019 - 03:01 by Z_CLU

ఎన‌ర్జ‌టిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. `డ‌బుల్ దిమాక్ హైద‌రాబాదీ` ట్యాగ్ లైన్‌. రీసెంట్‌గా టాకీ పార్ట్ షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాటల షూటింగ్ లోకి ఎంటరైంది.

ఇందులో భాగంగా గోవాలో రామ్-న‌భా న‌టేశ్‌ల‌పై ఓ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. భాను మాస్ట‌ర్ నృత్య రీతుల‌ను స‌మ‌కూరుస్తున్నారు. రామ్ జోడిగా నిధి అగ‌ర్వాల్, న‌భా న‌టేశ్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. పాటల షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. పూరిజ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి, ఛార్మి కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:
రామ్, నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌, పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌
సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ
ఆర్ట్‌: జానీ షేక్‌
సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌
మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌
ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.