డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్: ఫస్ట్ వీక్ కలెక్షన్

Thursday,July 25,2019 - 12:40 by Z_CLU

పక్కా మాస్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. రిలీజైన 3 రోజులకే బ్రేక్-ఈవెన్ అయిన ఈ సినిమా, వారం తిరిగేసరికి నిర్మాతలకు, బయ్యర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. అలా నిన్నటితో వారం రోజుల రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, ఫస్ట్ వీక్ లో ఏకంగా 27 కోట్ల 16 లక్షల రూపాయల షేర్ రాబట్టింది.

వారం రోజుల వసూళ్ల లెక్కలు చూసుకుంటే.. రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇస్మార్ట్ శంకర్. అటు పూరి కలలుకన్న బ్లాక్ బస్టర్ విజయం ఎట్టకేలకు దక్కింది. నైజాంలో ఈ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. వర్కింగ్ డేస్ తో సంబంధం లేకుండా సోమ, మంగళ, బుధవారాలు ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. అలా నైజాంలో బిగ్గెస్ట్ కలెక్షన్ సాధించిన రామ్ సినిమాగా ఇస్మార్ట్ శంకర్ నిలిచింది.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 11.90 కోట్లు
సీడెడ్ – రూ. 4.69 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 3.17 కోట్లు
ఈస్ట్ – రూ. 1.68 కోట్లు
వెస్ట్ – రూ. 1.39 కోట్లు
గుంటూరు – రూ. 1.74 కోట్లు
కృష్ణా – రూ. 1.68 కోట్లు
నెల్లూరు – రూ. 0.91 కోట్లు