నిజంగా దిమాక్ ఖరాబ్ చేసింది

Tuesday,September 24,2019 - 12:39 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్ మూవీ డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమా ఎంత హిట్ అయిందో, పాటలు అంతకుమించి హిట్ అయ్యాయి. ఈ సినిమాతో మణిశర్మ టాలెంట్ మరోసారి తెలిసొచ్చింది. మంచి సిచ్యుయేషన్ పడితే తన పవర్ ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ తో చూపించాడు మణిశర్మ. ఇప్పుడీ పాటలు ఒక్కొక్కటిగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి

ముందుగా దిమ్మాక్ ఖరాబ్ సాంగ్ ను రిలీజ్ చేసింది జీ మ్యూజిక్ సౌత్ సంస్థ. ఇలా విడుదలైన వెంటనే అలా వైరల్ అయింది ఈ సాంగ్. ఎప్పట్నుంచో ఈ వీడియో సాంగ్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సాంగ్ ను రిపీట్ మోడ్ లో చూడడం స్టార్ట్ చేశారు. అలా 3 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది ఈ సాంగ్.

ఇప్పుడు ఇదే ఊపులో ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి మరో సాంగ్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. సినిమాలో సూపర్ హిట్ అయిన టైటిల్ సాంగ్ ను ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు, జీ తెలుగు హెచ్ డీ ఛానెల్స్ లో ప్రసారం కానుంది.