ఇస్మార్ట్ శంకర్ కు లైన్ క్లియర్

Monday,July 15,2019 - 06:28 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కు రెడీ అయింది. కొద్దిసేపటి కిందట ఈ సినిమాకు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ అఫీషియల్స్ ఈ సినిమాకు A-సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తవ్వడంతో మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.

రామ్-పూరి జగన్నాధ్ ఫస్ట్ ఎవర్ కాంబినేషన్ లో వస్తోంది ఇస్మార్ట్ శంకర్. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అవ్వగా.. రీసెంట్ గా రిలీజ్ చేసిన సెకెండ్ ట్రయిలర్ కు కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్షన్ మాస్ ఎంటర్ టైనర్ గా వస్తోంది ఇస్మార్ట్ శంకర్. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషించాడు. పూరి కనెక్ట్స్, పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్లపై చార్మి, పూరి కలిసి ఈ సినిమాను నిర్మించారు.