ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్: 3 రోజుల వసూళ్లు అదుర్స్

Sunday,July 21,2019 - 01:10 by Z_CLU

రామ్-పూరి ఫస్ట్ ఎవర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది ఎంత హిట్ అయిందంటే.. గురువారం రిలీజైన ఈ సినిమా, విడుదలైన 3 రోజులకే బ్రేక్-ఈవెన్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 3 రోజుల్లో 16 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రిలీజైన ప్రతి ఏరియా నుంచి ఈ సినిమాకు కళ్లుచెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి.

ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) కంప్లీట్ అయ్యేసరికి ఈ సినిమాకు ఏపీ, నైజాం నుంచి 20 కోట్ల రూపాయల షేర్ రావొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. అంతేకాదు, అటు నైజాంలో 10 కోట్ల మార్క్ కూడా అందుకునే అవకాశాలున్నాయి.

కంప్లీట్ మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అటు ఓవర్సీస్ లో కూడా రామ్ మార్కెట్ ను ఇంకాస్త పెంచింది. సినిమా రిలీజై 3 రోజులైనప్పటికీ యూనిట్ అంతా ఇంకా సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 7.36 కోట్లు
సీడెడ్ – రూ. 2.82 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.92 కోట్లు
ఈస్ట్ – రూ. 1.07 కోట్లు
వెస్ట్ – రూ. 0.84 కోట్లు
గుంటూరు – రూ. 1.16 కోట్లు
నెల్లూరు – రూ. 0.53 కోట్లు
కృష్ణా – రూ. 1.03 కోట్లు