PSPKRanaMovie హీరోయిన్ ఫిక్స్ !

Wednesday,March 24,2021 - 01:03 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కలిసి నటిస్తున్న ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఫైనల్ చేశారు మేకర్స్. సినిమాలో  ఐశ్వర్య రానాకి జోడిగా నటిస్తుందని ప్రకటించాడు నిర్మాత వంశీ. ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న ఈ సినిమా త్వరలోనే మరో షెడ్యుల్ జరుపుకోనుంది. వచ్చే షెడ్యుల్ నుండి ఐశ్వర్య రాజేష్ షూట్ లో జాయిన్ అవ్వనుంది.

ఇక పవన్ కళ్యాణ్ కి కూడా హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు మేకర్స్. సాయి పల్లవి తో పాటు మిగతా టాప్ హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే పవర్ స్టార్ సరసన నటించే హీరోయిన్ ని ఫైనల్ చేసి అఫీషియల్ గా ప్రకటించనున్నారు. తెలుగు నేటివిటీ, పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేశారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే -మాటలు అందిస్తున్నాడు.

Also Check డబ్బింగ్ మొదలు పెట్టిన ‘వకీల్ సాబ్’