స్మాల్ బ్రేక్ ఇచ్చా.. మళ్లీ సినిమాల్లోకొస్తా

Wednesday,July 01,2020 - 12:50 by Z_CLU

ఇషా చావ్లా.. ఈ ముద్దుగుమ్మ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులైంది. దీంతో ఆమె సినిమాల నుంచి తప్పుకుందని చాలా మంది అనుకున్నారు. అయితే ఇషా చావ్లా మాత్రం అలాంటిదేం లేదంటోంది. చిన్న గ్యాప్ మాత్రం వచ్చిందని చెబుతోంది.

“కొన్నాళ్ళు పరిశ్రమకు దూరమై అమెరికాలో ఉండటం వల్ల కొత్త సినిమాలు ఓకే చేయలేదు. నేను సినీ పరిశ్రమ కు దూరమైనా నటనకు దూరం కాలేదు. సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, డాన్స్ మాస్టర్ భాను నేతృత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చాం ముఖ్యంగా శ్రీలంకలో చేసిన షోలకు మంచి గుర్తింపు వచ్చింది.”

స్మాల్ బ్రేక్ తర్వాత మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్నట్టు ప్రకటించింది ఇషా చావ్లా. ఇకపై తెలుగులో మరిన్ని సినిమాలు చేస్తానంటోంది.

“ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరిస్ లో చేస్తున్నా. కరోనా వల్ల అది ఆలస్యం అవుతోంది. తెలుగులో రెండు , తమిళ్ లో రెండు చిత్రాలు ఫైనల్ అయ్యాయి. మళ్ళీ తెలుగు మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది. హీరోయిన్ గా తెలుగులో నే నా తొలి పరిచయం జరిగింది. అందుకే తెలుగు చిత్రాలకే నా ప్రయారిటీ.”

ఈ లాక్ డౌన్ టైమ్ లో ముంబయిలో లాక్ అయిన ఇషా చావ్లా యోగా నేర్చుకున్నట్టు ప్రకటించింది. కొంత ఛారిటీ వర్క్ కూడా చేశానని చెబుతోంది