96 రీమేక్ కోసం ఇంట్రెస్టింగ్ టైటిల్స్

Tuesday,March 05,2019 - 11:36 by Z_CLU

సమంత, శర్వానంద్ జంటగా రాబోతోంది 96 రీమేక్. ఈ సినిమాకు ఒరిజినల్ టైటిల్ నే తెలుగులో కూడా కంటిన్యూ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ తెలుగు వెర్షన్ కు టైటిల్ మార్చాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు 2 పేర్లు లాక్ చేశారు. త్వరలోనే వాటిలోంచి ఓ టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారట.

96 రీమేక్ కు జాను అలియాస్ జానకిదేవి అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దీంతో పాటు 99 అనే మరో టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ రెండింటిలో ఓ పేరును ఫిక్స్ చేస్తారు. ఎక్కువమంది ఒపీనియన్ ప్రకారం.. మొదటి పేరునే ఇంకాస్త ట్రిమ్ చేసి జాను అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

తమిళ్ లో కల్ట్ క్లాసిక్ గా పేరుతెచ్చుకుంది 96 రీమేక్. విజయ్ సేతుపతి, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఈ హార్ట్ టచింగ్ మూవీని ప్రేమ్ కుమార్ డైరక్ట్ చేశాడు. అతడే ఇప్పుడు తెలుగు వెర్షన్ ను కూడా డైరక్ట్ చేయబోతున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది.