కారణం అదేనా ?

Thursday,October 13,2016 - 01:22 by Z_CLU

టాలీవుడ్ వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రకుల్ ప్రస్తుతం ఓ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. రకుల్ వదులుకుంది తెలుగు సినిమా కాదట. ఈ మధ్యనే విశాల్ తో ఓ సినిమా చెయ్యడానికి సిద్దమయిన ఈ అమ్మడు ఆ సినిమా నుండి తప్పుకుందనే టాక్ వినిపిస్తోంది. మరి ఉన్నట్టుండి ఈ అమ్మడు కోలీవుడ్ లో ఈ అఫర్ ఎందుకు వదులుకుందా ? అనే ప్రశ్న కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

        అయితే రకుల్ ఈ సినిమా వదులుకోవడానికి టాలీవుడ్ లో 3 సినిమాలకు కమిట్ అవ్వడమే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ధృవ’ తో పాటు మహేష్-మురుగదాస్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు సాయి ధరమ్ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమాలో నాయికగా నటిస్తోంది. ఇక రకుల్ ఈ చిత్రం నుంచి తప్పుకోవడం తో విశాల్ టీం మరో హీరోయిన్ ను సంప్రదిస్తున్నారని సమాచారం.