సింహాన్ని వదలని సూర్య.. మరో సీక్వెల్?

Thursday,April 05,2018 - 05:48 by Z_CLU

ప్రస్తుతం సెల్వరాఘవన్ సినిమాతో బిజీగా ఉన్నాడు సూర్య. అయితే మరోపక్క విక్రమ్ తో సామి – 2 సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న దర్శకుడు హరి, తన నెక్స్ట్ సినిమా సూర్యతో ఉండబోతుందని కన్ఫమ్ చేయడంతో, ఈ సక్సెస్ ఫుల్ కాంబో, సింగం 4 ని ప్లాన్ చేస్తుందా..? అనే డిస్కషన్స్ బిగిన్ అయ్యాయి.

దర్శకుడు హరి,  ఈ సినిమాకు సంబంధించిన  డీటేల్స్  అయితే  ఇంకా అనౌన్స్  చేయలేదు.  ఇంతకీ  దర్శకుడు హరి  ఫ్యాన్స్  ఎక్స్  పెక్ట్   చేస్తున్నట్టు సింగం  4  ప్లాన్   చేస్తున్నాడా…? లేక  మరో  మాస్ యాక్షన్  ఎంటర్  టైనర్ చేయబోతున్నాడా..?   అనే  క్లారిటీ  రావాలంటే  ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఏది  ఏమైనా  ఈ పవర్ ప్యాక్డ్  కాంబో మరోసారి సెట్స్  పైకి  వస్తే  సెన్సేషన్  క్రియేట్ అవ్వడం గ్యారంటీ  అంటున్నారు ఫ్యాన్స్.

 

సెల్వరాఘవన్ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా గతంలో వీడొక్కడే, బ్రదర్స్ లాంటి బ్లాక్ బస్టర్ లకు దర్శకత్వం వహించిన K.V. ఆనంద్ డైరెక్షన్ లో సెట్స్ పై ఉంటాడు సూర్య. ఈ సినిమాతో పాటు సుధా కొంగర తో కూడా సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. మరి సినిమాల మధ్య హరి డైరెక్షన్ లో ఉండబోయే సినిమా సెట్స్ పైకి ఎప్పుడు రానుంది అనే డీటేల్స్ తెలియాల్సి ఉంది.