అవికా గోర్ కి రాజుగారి గది కలిసొచ్చేనా..?

Friday,October 18,2019 - 09:02 by Z_CLU

ఎప్పుడో 2016 లో రిలీజైన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరవాత మళ్ళీ తెలుగు సినిమాలో కనిపించలేదు అవికా గోర్. ఇంకొన్నాళ్ళు ఇలాగే కంటిన్యూ అయితే అవిక గోర్ రీ ఎంట్రీ అనాల్సి వచ్చేది. కానీ రాజుగారి గది ఈ హీరోయిన్ ని కొద్దో గొప్పో కాపాడేసింది. అయితే మళ్ళీ బిజీ అయ్యే స్థాయిలో కలిసొస్తుందా..?

సమయానికి తమన్నా తప్పుకోవడం అవికాని ఈ సినిమా సెట్స్ పైకి తీసుకొచ్చింది. సినిమాలో క్యారెక్టర్.. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా అవికా పర్ఫామెన్స్ కూడా అదరగొట్టినట్టే అనిపిస్తుంది. కాకపోతే ఈ పరిస్థితుల్లో అవికాకి అప్లాజ్ కన్నా, అవకాశాలే చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ సినిమా తన కరియర్ కి ఏ మాత్రం కలిసొస్తుందనేదే ఇక్కడ ప్రశ్న.

అవికా ఇన్నాళ్ళ కరియర్ లో ఇప్పటి వరకు గ్లామరస్ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకోలేకపోయింది. తనకు నిజంగా అవకాశాలు రాలేదా..? లేకపోతే స్క్రిప్ట్ సెలెక్షన్ లో జరిగిన పొరపాటా..? ఎగ్జాక్ట్ గా తెలీదు కానీ టాలీవుడ్ లో మాత్రం అవికా ఇంకా స్ట్రగుల్ స్టేజ్ లోనే ఉంది.

అవికా మాత్రం ‘రాజుగారి గది 3’ తనకు కలిసొస్తుందనే కాన్ఫిడెన్స్ తోనే ఉంది. తన మిగతా సినిమాల కన్నా ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ మరింత ఎలివేట్ అవుతుందని, డెఫ్ఫినెట్ గా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందనే ధీమాతోనే ఉంది.