రాజ్ తరుణ్ టైమ్ స్టార్ట్ అయిందా..?

Thursday,June 20,2019 - 01:02 by Z_CLU

రాజ్ తరుణ్ మంచి ఫామ్ లో ఉన్నాడనుకున్నప్పుడు వరస పెట్టి క్యూ కట్టాయి ఫ్లాపులు… రాజ్ తరుణ్ సినిమా ఆడట్లేదు అంటే ఎక్స్ పెక్ట్ చేసిందే అన్నంతగా బ్యాడ్ టైమ్ ఫేస్ చేశాడు. ఏదైతేనేం బ్యాక్ టు బ్యాక్ సినిమా ఫార్ములాని పక్కన పెట్టి, ఈసారి గట్టిగా కొట్టాల్సిందే అని ఫిక్సయి దిల్ రాజు బ్యానర్ లో సంతకం చేశాడు ఈ హీరో. గమనిస్తే అక్కడి నుండే రాజ్ తరుణ్ టైమ్ స్టార్ట్ అయిందనిపిస్తుంది.

దిల్ రాజు సినిమా అంటే మినిమం సక్సెస్ గ్యారంటీ. అంతెందుకు కథలో దమ్ము లేకపోతే దిల్ రాజు అంత ఈజీగా సినిమా చేయడు. ఈ సినిమా రిలీజైతే రాజ్ తరుణ్ మళ్ళీ నిలదొక్కుకునే చాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సినిమాతో పాటు మరో మూవీ లాంఛ్ చేశాడు రాజ్ తరుణ్.

విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో నటించబోతున్నాడు రాజ్ తరుణ్. అంటే టాలీవుడ్ లో రాజ్ తరుణ్ చుట్టూ ఇంకా పాజిటివ్ బజ్ అలాగే ఉందన్నమాట. ఈ యంగ్ హీరో చేయాల్సిందల్లా కాస్తంత జాగ్రత్తగా కథలు ఎంచుకోవడమే.

ఏది ఏమైనా ఆ మధ్య కనీసం న్యూస్ లో కూడా లేకుండా పోయిన రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేయడం ఫ్యాన్స్ లో మంచి ఎనర్జీనిస్తోంది. దానికి తగ్గట్టే సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేస్తే రాజ్ తరుణ్ కి తిరుగులేదంతే.