స్నేహం కోసం...

Friday,October 21,2016 - 05:35 by Z_CLU

హీరోగా వరుస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని… ఇప్పుడు కొత్తదారిలో అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా ఓ ప్రయత్నం చేసిన ఈ హీరో… ఇప్పుడు మరోసారి పూర్తిస్థాయి నిర్మాతగా మారాలనుకుంటున్నాడు. అది కూడా తన ప్రాణ స్నేహితుడి కోసం ఈ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

  మజ్ను తరవాత తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో సినిమా ఉంటుందని ముందుగానే ప్రకటించిన నాని, ఇప్పుడు ఆ సినిమాని నిర్మించే బాధ్యతను కూడా తీసుకున్నాడట. గతంలో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘D ఫర్ దోపిడీ’ సినిమాకు సహనిర్మాతగా నాని వ్యవహరించాడు. ఈసారి మాత్రం అవసరాల డైరక్షన్ లో తనే హీరోగా, స్వీయనిర్మాణంలో సినిమా నిర్మించాలని ఫిక్స్ అయ్యాడట. అవసరాల శ్రీనివాస్-నాని కలిసి చేసిన ప్రతి ప్రాజెక్టు హిట్ అయింది. నాని నిర్మాతగా మారడానికి ఆ సెంటిమెంట్ కూడా ఓ రీజన్ అవ్వొచ్చు.