Karthika - రాధ కూతురు సినిమాలకు గుడ్ బై?

Sunday,June 27,2021 - 12:18 by Z_CLU

Karthika Nair quits acting
అలనాటి హాట్ హీరోయిన్ రాధ కూతురు ఇండస్ట్రీలోకి వచ్చిన టైమ్ లో చాలా బజ్ నడిచింది. నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో కార్తీక ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమెకు విపరీతంగా ప్రచారం వచ్చింది. అయితే ఆ ప్రమోషన్ ను, ఆ జోష్ ను ఆమె క్యాష్ చేసుకోలేకపోయింది. పెద్ద పెద్ద ఆఫర్లు అందుకోలేక
చతికిలపడింది.

karthika zeecinemalu

అప్పట్నుంచి కెరీర్ ను సోసోగా లాగిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు ఏకంగా యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేయాలని అనుకుంటోందట. ప్రస్తుతం కార్తీకకు సంబంధించి ఈ రూమర్ జోరుగా స్ప్రెడ్ అవుతోంది. మరికొన్ని రోజుల్లో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేస్తుందంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఆమె పెళ్లి కాదు.

karthika zeecinemalu

సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకున్నప్పుడు కెరీర్ ఆపేస్తారు. కానీ కార్తీక మాత్రం తన కెరీర్ ను మారుస్తోంది. కొన్నేళ్ల కిందట బిజినెస్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టింది కార్తీక. తండ్రికి సంబంధించిన వ్యాపారాలు చూసుకోవడంతో పాటు, సొంతంగా కూడా కొన్ని స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు తన వ్యాపారాల్ని మరింత డెవలప్ చేసే ఆలోచనలో ఉందట కార్తీక్. మరోవైపు ఆమెకు సినీ అవకాశాలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అందుకే మూవీ కెరీర్ ఆపేయాలని అనుకుంటోందట.

karthika zeecinemalu

షార్ట్ గ్యాప్ లోనే సౌత్ మొత్తం కవర్ చేసింది కార్తీక. కానీ ఏ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. జోష్ ఫ్లాప్ తర్వాత టాలీవుడ్ నుంచి కోలీవుడ్ కు షిఫ్ట్ అయింది. కో (తెలుగులో రంగం) అనే సినిమా చేసింది. అది హిట్టయినా కార్తీకకు కలిసిరాలేదు. ఆ తర్వాత మలయాళంలో 2 సినిమాలు చేసింది. అవి కూడా కలిసిరాలేదు. ఆ తర్వాత కన్నడలో ఓ సినిమా చేసింది.

karthika zeecinemalu

ఇలా సౌత్ ఇండస్ట్రీస్ అన్నీ చుట్టేసింది. మధ్యలో తెలుగులో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాలు చేసినప్పటికీ ఈసారి కూడా క్లిక్ అవ్వలేకపోయింది. నాలుగేళ్లుగా కార్తీక సినిమాలు చేయడం లేదు. ఇకపై కూడా ఆమె సినిమాలు చేయదంటున్నారు చాలామంది. ఈ టైమ్ లో కార్తీక చెల్లెలు తులసి హీరోయిన్ గా వస్తుందేమో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics