‘రెజీనా’కిది మరో అవకాశమా..?

Tuesday,June 04,2019 - 01:01 by Z_CLU

2017 లో 2 సినిమాల్లో కనిపించింది. ‘అ!’ లో నటించిందన్న ఒక్క కారణంతో 2018 లో సినిమా చేయలేదు అని చెప్పలేం అంతే కానీ మార్క్ క్రియేట్ చేసే స్థాయిలో ఏమీ చేయలేదు… ఆల్మోస్ట్ ఫ్యాన్స్ మరచిపోతున్న టైమ్ లో ఇప్పుడు ‘7’ సినిమాతో మరోసారి స్క్రీన్ పై కనిపించబోతుంది రెజీనా…

మోస్ట్ ఇంటెన్సివ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇంకో 2 రోజుల్లో ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందనగా అడివి శేష్ ‘ఎవరు’ లో కూడా రెజీనా హీరోయిన్ గా కన్ఫమ్ అయింది. దీన్ని బట్టి ఆల్మోస్ట్ ఫేడవుట్ అయిందనుకున్న రెజీనా కరియర్ మళ్ళీ ట్రాక్ పైకి వచ్చిందనుకోవచ్చా..?

వరస ఫ్లాపులు రెజీనాని కమర్షియల్ హీరోయిన్ రేస్ లో కొంచెం వెనకబడేలా చేసినా, పర్ఫామెన్స్ లో కానీ, గ్లామర్ విషయంలో కానీ రెజీనా స్థానం రెజీనాదే. కానీ ఆ స్థానాన్ని మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకురావడంలో ఈ 2 సినిమాలు కలిసొస్తాయా..?

ఓ రకంగా చెప్పాలంటే రెజీనాకు దొరికిన మరో అవకాశం ఇది. ఈ 2 సినిమాలతో ఎలాగోలా తన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగితే చాలు… అనుమానం లేదు. రెజీనా టాప్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇవ్వడానికి ఆల్మోస్ట్ క్వాలిఫై అయినట్టే.. చూడాలి మరీ… ఏం జరుగుతుందో….