అడివి శేష్ గూఢచారికి సీక్వెల్..?

Wednesday,August 08,2018 - 03:52 by Z_CLU

స్టైలిష్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన గూఢచారి అడవి శేష్ కరియర్  ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. సినిమా రిలీజ్ కి ముందు ఈ సినిమా చుట్టూ క్రియేట్ అయిన ఎక్స్ పెక్టేషన్స్ ని 100% రీచ్ అవ్వడంలో సూపర్ సక్సెస్ అయ్యారు ఫిలిమ్ మేకర్స్. అయితే ఇదే జోష్ లో ఈ సినిమా సీక్వెల్ పై దృష్టి పెట్టింది ‘గూఢచారి’ టీమ్.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఫిల్మ్ మేకర్స్, ఈ సీక్వెల్ గురించి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. గూఢచారికి మూలకథను అందించిన అడివి శేష్, ఈ సీక్వెల్స్ కి సంబంధించి ఆల్రెడీ ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

 

శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ లో సక్సెస్ ఈవెంట్ జరుపుకుంటుంది. ఈ ఈవంట్ కి నాగార్జున చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు. ‘గూఢచారి’ శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కింది.