యాక్షన్ కింగ్ ప్లస్ అవుతాడా....?

Sunday,July 16,2017 - 01:11 by Z_CLU

హను రాఘవపూడి డైరెక్షన్ లో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లై’. ఇటీవలే టీజర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమాలో స్టైలిష్ లుక్ తో హైలైట్ గా నిలిచాడు యాక్షన్ కింగ్.. ప్రెజెంట్ తన లుక్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న అర్జున్ సినిమాకు మేజర్ హైలైట్ గా నిలిస్తాడనే టాక్ వినిపిస్తుంది..

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లో స్టైలిష్ లుక్ తో మెస్మరైజ్ చేసిన అర్జున్ లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో “అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తి అవ్వదట. అశ్వద్ధామ హతః….కుంజరః అనే ఈ డైలాగ్ తో అదుర్స్ అనిపించి ఆకట్టుకున్నాడు. స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన అర్జున్ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ తో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడని, మొన్నటి వరకూ తెలుగులో కొన్ని రోల్స్ కి నో చెప్పిన అర్జున్ ఈ రోల్ నచ్చే సినిమా చేశాడని, ఖచ్చితంగా సినిమాకు ప్లస్ అవతాడని యూనిట్ చెప్తుంది. మరి కొన్నేళ్ల గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న అర్జున్ స్టైలిష్ విలన్ గా ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి.