అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ నుండి మరో సర్ ప్రైజ్

Monday,April 23,2018 - 07:39 by Z_CLU

టాలీవుడ్ లో ఎక్కడ చూసినా ‘నా పేరు సూర్య’ మానియా కనిపిస్తుంది. నిన్న జరిగిన ఆడియో లాంచ్ తరవాత ఫ్యాన్స్ లో ఈ సినిమాపై మరింత ఫోకస్ పెరిగింది. ఇప్పటికే  రిలీజైన  ఈ సినిమా  సాంగ్స్  సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. దానికి తోడు ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘ఇరగ ఇరగ’ ప్రోమోని రేపు సాయంత్రం 5:30 కి రిలీజ్ చేయనున్నారు ఫిల్మ్ మేకర్స్.

మాస్ బీట్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ ఇప్పటికే మాస్ లో భారీ స్థాయిలో రిజిస్టర్ అయింది.  అలాంటిది రేపు రిలీజ్ కానున్న ఈ ప్రోమోతో, ఆడియెన్స్ లో ఈ సినిమా చుట్టూ మరింత క్యూరాసిటీ జెనెరేట్ చేయడం ఖాయమనే అనిపిస్తుంది. ఈ సాంగ్ లో బన్ని తన  విశ్వరూపం  చూపించాడు అంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బన్ని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ లా కనిపించనున్నాడు. శరత్ కుమార్, యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారు. విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్.