రంగ్ దే ఫస్ట్ లుక్: అను-అర్జున్ ప్రేమకథ

Sunday,March 29,2020 - 07:06 by Z_CLU

హీరో ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ఫ్రెష్ కాంబినేషన్ లో సూపర్ హిట్ ప్రొడక్షన్ హౌజ్ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలిప్రేమ’, ‘మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యంగ్ డైరక్టర్ ‘వెంకీ అట్లూరి’ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ నెల 30న హీరో నితిన్ బర్త్ డేను పురస్కరించుకొని కొద్దిసేపటి కిందట ‘రంగ్ దే’ చిత్రం మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్ల పాత్రలను పరిచయం చేశారు. ఇందులో హీరో పాత్ర పేరు అర్జున్. హీరోయిన్ క్యారెక్టర్ అను. అను-అర్జున్ ల ప్రేమకథగా వస్తోంది రంగ్ దే. మోషన్ పోస్టర్ కు దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ చాలా బాగుంది.

సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో, పి.డి.వి.ప్రసాద్ సమర్పిస్తున్న ఈ సినిమాలో నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్… ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

టెక్నీషియన్స్
డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశీ
రచన,దర్శకత్వం: వెంకీ అట్లూరి