Agent Vinod Pre Look: హీరో సస్పెన్స్

Thursday,August 06,2020 - 06:23 by Z_CLU

టాలీవుడ్‌లో పేరుపొందిన డిస్ట్రిబ్యూష‌న్‌, ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ల‌లో ఒక‌టైన అభిషేక్ పిక్చ‌ర్స్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో వ‌స్తోంది. ‘ఏజెంట్ వినోద్’ అనే టైటిల్‌తో రూపొందే ఈ సినిమా ప్రి-లుక్‌ను ఈరోజు రిలీజ్ చేశారు.

ఆ లుక్‌లో పుస్త‌కాలు, తాళాలు, లాంత‌రు, టైపింగ్ మెషీన్‌, పెన్ను, కెమెరా, గ‌డియారం, ప్ర‌పంచ‌ప‌టం వంటి పాత కాలం వ‌స్తువులు క‌నిపిస్తున్నాయి. వాటితో పాటు గ‌న్‌, ర‌క్త‌పు మ‌ర‌క‌లు, ఒక వ్య‌క్తి నీడ క‌నిపిస్తుండ‌టంతో ఇది ఉత్కంఠ‌భ‌రిత‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ అని అర్థ‌మ‌వుతోంది.

ఆ నీడ ఎవ‌రిది? ఏజెంట్ వినోద్‌దా? లేక ఎవ‌రైనా క్రిమిన‌ల్‌దా? ఏదేమైనా ఈ మూవీలో టైటిల్ రోల్ పోషిస్తున్న‌దెవ‌రో తెలుసుకోవాలంటే ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేవ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

వింటేజ్ స్పై డిటెక్టివ్ థ్రిల్ల‌ర్‌గా రూపొంద‌నున్న ‘ఏజెంట్ వినోద్‌’లో ఒక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్నాడు.

వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్‌గా దాదాపు 40 హాలీవుడ్ ఫిలిమ్స్‌కు వ‌ర్క్ చేసిన న‌వీన్ మేడారం ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది ఆయ‌న‌కు మూడో చిత్రం.

సాంకేతిక బృందం:
మ్యూజిక్‌: హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీష్ చీక‌టి
ఎడిటింగ్‌: అన్వ‌ర్ అలీ
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: దేవాన్ష్ నామా, ర‌వి పుట్టా
నిర్మాత‌: అభిషేక్ నామా
ద‌ర్శ‌కుడు: న‌వీన్ మేడారం
బ్యాన‌ర్‌: అభిషేక్ పిక్చ‌ర్స్‌