Interview - శ్రీవిష్ణు (రాజ రాజ చోర)

Wednesday,August 18,2021 - 07:06 by Z_CLU

తనకి సరిపడ కథలను ఎంచుకొని కంటెంట్ ఒరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ అందుకున్న శ్రీ విష్ణు ‘రాజ రాజ చోర’ అంటూ కింగ్ సైజ్ ఎంటర్టైన్ మెంట్ తో రేపే రాబోతున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు శ్రీ విష్ణు. ఆ విశేషాలు తన మాటల్లోనే…

sree vishnu
దాన్ని హోల్డ్ పెట్టి ఇది చేశాం

హసిత్ నాకు ముందు వేరే కథ వినిపించాడు. చాలా కొత్త స్క్రిప్ట్ అది. ట్రావెలింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న డిసేస్ మీద రన్ అయ్యే కథ అది. హసిత్ కి ఫస్ట్ ఫిలిం. ఫస్ట్ అలాంటి స్క్రిప్ట్ అంటే రిస్క్ ఉంటుందేమో అని చిన్న భయం ఉండింది. మనం మందు ఒకటి ప్రూవ్ చేసుకొని సక్సెస్ అయ్యాక అలాంటివి చేస్తే బెటర్ అని నేను హసిత్ ఇద్దరం అనుకున్నాం. సో కొన్ని రోజులు దాన్ని పక్కన పెడదామ్ అనుకొని ఇది స్టార్ట్ చేశాం.

నాకే అనిపించింది

వెంకటేష్ గారి సినిమాలతో పోల్చడానికి రీజన్ ఉంది. ఈ సినిమా చూసాక ఆయన నుండి వచ్చిన ఎంటర్టైన్ మెంట్ సినిమాలు ఫ్యాన్స్ కి గుర్తొస్తాయి. నేను ఆయన అభిమానిని. అంత ఈజీగా ఆయన సినిమాలతో కంపేర్ చేశానంటే సినిమా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఆయన సినిమాలు ఎలా అయితే ఫ్యామిలీ అందరు కలిసి చూస్తారో ఈ సినిమా కూడా అలాగే అందరు కలిసి చూసేలా ఉంటుంది. కంపేర్ చేయడానికి అది కూడా ఒక రీజన్.

చేసే ముందు వెంకటేష్ గారికి చెప్పాను

ఈ సినిమా చేసే ముందు వెంకటేష్ గారికి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. అప్పటి నుండి ఆయన విషెస్ నాకు ఉన్నాయి. టీజర్ చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇక నిన్న వెళ్లి కలవడం జరిగింది. టీజర్ బాగుంది. సినిమా కూడా డెఫినెట్ గా బాగుంటుందనిపిస్తుందని చెప్పి టీం కి కూడా విషెస్ తెలిపారు.

sree vishnu

సినిమానే మాట్లాడించింది

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడటానికి మెయిన్ రీజన్ సినిమానే. మంచి కథ కుదిరింది. సినిమా కూడా బాగా వచ్చింది. ఈవెంట్ రోజే సినిమా చూశాను. ఆ ఎగ్జైట్మెంట్ తోనే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాను.

అది అవసరం అనిపించింది

బేసిక్ గా నేను ఈవెంట్స్ లో చాలా తక్కువ మాట్లాడతాను. కానీ ఈసారి కొంచెం గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే బయట పరిస్థితులు బాలేదు. ఈ టైంలో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడం కష్టం. కానీ సినిమా బాగుంది అంటే తప్పకుండా చూస్తారు అనే నమ్మకం ఉంది. సినిమా చూసి నేను పొందిన తృప్తి కచ్చితంగా రేపు ప్రేక్షకులు కూడా పొందుతారనిపించింది. అందుకే సినిమాకు గురించి చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడాను. రేపు సినిమా చూసి నేను మాట్లాడింది గుర్తుచేసుకొని నిజమే చెప్పాడు అంటారు.

ఇది అలాంటి సినిమా

ఈ మధ్య OTT లో చూసి కొన్ని బాషల్లో వచ్చిన సినిమాలను ఎక్కువ పొగుడుతున్నాం కదా ఇది అలాంటి సినిమానే. రిలీజ్ తర్వాత ఎక్కువ రోజులు సినిమా గురించి మాట్లాడుకుంటారు. అది మాత్రం పక్కా. ముఖ్యంగా ఈ జానర్ లో డిఫరెంట్ ఎటెంప్ట్ అనిపిస్తుంది.

sree vishnu
చిలిపి దొంగ

సినిమాలో నేను దొంగ. మరీ పెద్ద పెద్ద దొంగతనాలు గట్రా చేయను కానీ కొంటె దొంగ అనుకోవచ్చు. నా క్యారెక్టర్ చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. బిల్డప్ లు హడావుడిలు ఏం ఉండవు. ఆడు మాట్లాడే విధానం మేనిప్లేట్ చేయడం బాగా ఎంటర్టైన్ చేస్తాయి.నా క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతారు.

సిద్ శ్రీరామ్ సాంగ్ సినిమాలోనే

సిద్ శ్రీరామ్ ఒక పాట పాడాడు. చాలా మంది సాంగ్ అది. ఆ సాంగ్ అందరికి బాగా నచ్చింది. సిద్ పాడిన పాటలన్నీ సూపర్ హిట్. ఓపెనింగ్స్ తెచ్చిపెడతాయి. కానీ సిద్ శ్రీరామ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ప్రమోషన్ కోసం వాడుకోవడం మాకు ఇష్టం లేదు. సినిమాలో క్లైమాక్ కి ముందు వచ్చే ఎమోషనల్ సాంగ్ అది. కథ ప్రకారం మంచి సిచ్యువేషణ్ లో వస్తుంది. అది సినిమాలోనే వినాలి చూడాలి. సినిమా రిలీజ్ తర్వాత ఆ సాంగ్ రిలీజ్ చేస్తాం.

రీమేక్ చేస్తారని నమ్ముతున్నా

ఆల్రెడీ నేను చేసిన సినిమాలన్నీ ఇతర భాషల్లో రీమేక్స్ చేస్తున్నారు. కానీ నేనెప్పుడు చెప్పుకోలేదు. ఇది కూడా కచ్చితంగా అన్ని భాషల్లో రీమేక్ చేస్తారు. ఇందులో అందరికీ కనెక్ట్ అయ్యే స్టఫ్ ఉంది. ఏ లాంగ్వేజ్ లో చేసిన కచితంగా బాగుంటది. నేను చెప్పానని కాదు రేపు రిలీజ్ తర్వాత వాళ్ళకే అనిపిస్తుంది. అప్పుడు కచ్చితంగా రైట్స్ తీసుకొని రీమేక్ చేస్తారని నమ్ముతున్నా.


ఫస్ట్ హాఫ్ లో నేను చెప్పేదంతా…

కామెడీ చేయడం చాలా కష్టం. ఒకే టైప్ ఆఫ్ కామెడీ చేసినా అదే ముద్ర పడిపోతుంది. అందుకే కామెడీలో రకరకాల వేరియేషన్ ఇస్తూ వచ్చాను. ఇందులో కొంచెం ఎలాబరేట్ చేయడం జరిగింది. కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ కొత్తగా ఎంటర్టైన్ చేస్తాను. ఇక ఫస్ట్ హాఫ్ లో నేను చెప్పేదంతా అబద్దాలే. కానీ చెప్పినంత సేపు నిజమే అనుకుంటారు అందరు. ఆ అబద్దాలు చెప్తూ నేను ఉన్న సరౌండింగ్ లో ఎలా బ్యాలెన్స్ చేయగలిగాను అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ముందుగా మాట్లాడేది మ్యూజిక్ గురించే

మేము ఎంత చేసిన ఫైనల్ గా ఎమోషన్ క్యారీ అయ్యేది మ్యూజిక్ తోనే. వివేక్ సాగర్ బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ కథకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సాంగ్స్ , సిద్ సాంగ్ నుండి సినిమా అంతా హార్ట్ టచింగ్ ఉంటుంది. అక్కడ వివేక్ బాగా వర్క్ చేశాడు.

ఇద్దరూ బిజీ అవుతారు

మేఘ ఆకాష్, సునైనా ఇద్దరు తెలుగు వాళ్ళే.కానీ తమిళ్ ఎక్కువ సినిమాలు చేశారు. తెలుగులో కూడా చేశారు కానీ తక్కువే. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వాళ్ళ కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అవుతాయి. ఈ సినిమా తర్వాత వాళ్ళిద్దరూ చాలా బిజీ అవుతారు.


గాలి సంపత్ డిసప్పాయింట్

గాలి సంపత్ సినిమా రిలీజ్ తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. ఆ సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరైనా సినిమా హిట్టవ్వాలనే చేస్తారు. కానీ కొన్ని సార్లు ఇలా జరుగుతాయి. వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్లిపోవాలి. ముందు రోజే ఆ సినిమా చేశాను. తొందరగా రిలీజ్ చేయడం లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి.

నెక్స్ట్ ఇవే

నెక్స్ట్ ‘అర్జునా ఫల్గునా’ , ‘భళా తందనాన’ చేస్తున్నాను. వీటితో పాటు ఓ కాప్ బయోపిక్ కూడా చేస్తున్నా. కొందరి రియల్ ఇన్సిడెంట్స్ తో ఫిక్షనల్ సినిమాగా అది తెరకెక్కనుంది. ఇప్పటికే సగం షూటింగ్ అయ్యింది. అవన్నీ ఆడియన్స్ ని కచ్చితంగా మెప్పిస్తాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics