Nagarjuna కొత్త సినిమా.. ఇంట్రెస్టింగ్

Sunday,September 20,2020 - 03:25 by Z_CLU

ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్న King Nagarjuna నెక్స్ట్ Praveen Sattaru డైరెక్షన్ లో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ కాంబో సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మొన్నటి వరకు ఈ సినిమాను హిందీ చిత్రం ‘Raid’కు రీమేక్ గా తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది.

కానీ ఇప్పుడు ఇది రీమేక్ కాదని, నాగ్ ఓ రైతుగా కనిపిస్తాడని అలాగని ఇది సందేశంతో కూడిన సినిమా కాదని తెలుస్తుంది. ఇదొక పూర్తి స్థాయి యాక్షన్ సినిమా అని ప్రచారం జరుగుతుంది.

సినిమాలో ప్రవీణ్ సత్తారు మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని సమాచారం. మరి కింగ్ ని ఈ యంగ్ డైరెక్టర్ ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Sri Venkateswara Cinemas LLP, NorthStar Entertainments నిర్మిస్తున్న ఈ సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతుంది.