అఖిల్ సినిమాకి ఇంటరెస్టింగ్ టైటిల్

Tuesday,August 22,2017 - 12:37 by Z_CLU

రెండు రోజులుగా అఖిల్ సెకండ్ మూవీ టైటిల్ పై రేజ్ అయిన స్పెక్యులేషన్ కి బ్రేక్ పడింది. ఈ సినిమా టైటిల్ విషయంలో నాగార్జున తో పాటు, నాగచైతన్య చిన్న చిన్న క్లూస్ ఇస్తూ ఈ సినిమా టైటిల్ విషయంలో ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అల్టిమేట్ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘హలో’ అని టైటిల్ ఫిక్స్ చేసింది సినిమా యూనిట్.

టైటిల్ తో పాటు రిలీజైన  ఈ సినిమా ఫస్ట్ లుక్, ఇప్పుడు  సోషల్ మీడియాలో  ఫాస్టెస్ట్ స్పీడ్ లో సర్క్యులేట్  అవుతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్  మూవీని  నాగార్జున, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని డిసెంబర్ 22 న రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉంది సినిమా యూనిట్.  ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజర్.