'రంగ మార్తాండ' లో ఊహించని స్టార్స్ !

Sunday,December 15,2019 - 02:26 by Z_CLU

మరాఠీ క్లాసిక్ సినిమా ‘నట సామ్రాట్’ సినిమాను క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ‘రంగ మార్తాండ’ టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ మెయిన్ లీడ్ రోల్స్ చేస్తుంటే బ్రహ్మానందం ఓ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇక వీరితో పాటు అనసూయ ,రాహుల్ సింప్లీ గంజ్ కూడా క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం సినిమాలో మరో కీ రోల్ కి బిగ్ బీ అమితాబ్ ను కూడా సంప్రదించాడట కృష్ణవంశి. అయితే బిగ్ బీ సినిమాలో నటిస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక జీవిత రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా సినిమాలో ఓ రోల్ చేస్తుందట. వచ్చే నెలలో షూటింగ్ లో పాల్గొననుందని సమాచారం. సో ఈసారి ఈసారి కృష్ణవంశీ భారీ స్టార్ క్యాస్టింగ్ తో కనువిందు చేయబోతున్నాడన్నమాట.