రజినీకాంత్ 2.0 లో ఇంటరెస్టింగ్ పాయింట్స్

Thursday,October 12,2017 - 10:04 by Z_CLU

మోస్ట్ అవేటెడ్ మూవీ 2.0 ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. 3D ఫార్మాట్ లో తెరకెక్కుతున్న ఈ హై ఎండ్ టెక్నికల్ యాక్షన్ ఎంటర్టైనర్ రోజు రోజుకి ఫ్యాన్స్ లో క్యూరాసిటీ రేజ్ చేస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా డైరెక్టర్ శంకర్, 2.0 కి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

గ్లోబల్ మెసేజ్ : సినిమాలో రోబో బేస్డ్ కంటెంట్ ఉంటుందనే క్లారిటీ ఉన్నా, నిజానికి ఈ సినిమా కథ ఏమై ఉంటుందనే పాయింట్ ఇప్పటి వరకు బయటికి రాలేదు. కానీ శంకర్ మాత్రం ఈ సినిమాలో గ్లోబల్ మెసేజ్ ఉండబోతుందన్న విషయాన్ని కన్ఫం చేశాడు. ఆ మెసేజ్ ఏమిటన్నది సినిమా రిలీజైతే కానీ తెలీదు.

సాంగ్స్ అన్నీ సెట్స్ లోనే : శంకర్ సినిమాలో సాంగ్స్ అంటేనే ఎగ్జోటిక్ లొకేషన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. కానీ సందర్భానుసారంగా ఉండబోయే 2.0 మూవీలోని సాంగ్స్ మ్యాగ్జిమం సెట్స్ లోనే షూట్ చేశారు.

 

డిఫెరెంట్ షేడ్స్ ఉన్న విలన్ : 2.0 మూవీ అనగానే ఫస్ట్ మైండ్ లో స్ట్రైక్ అయ్యే ఎలిమెంట్ సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ ఇమేజ్ కి ధీటుగా ఉండబోతుంది ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ క్యారెక్టర్ లో డిఫెరెంట్ డిఫెరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయని సినిమాలో ఈ క్యారెక్టర్ వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అని తెలుస్తుంది.

ఓవరాల్ గా 2.0 షూటింగ్ లొకేషన్స్ :  ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను అమెరికాలోని కాన్సాస్ లో చిత్రీకరించిన సినిమా యూనిట్, మరికొన్ని సన్నివేశాలను ఢిల్లీ, చెన్నైలో చిత్రీకరించారు.

రోబోకి సీక్వెల్ కాదు : 2.0 అనగానే ఈ సినిమా గతంలో రిలీజైన రోబో మూవీకి సీక్వెల్ అనుకుని ఫ్యాన్స్  ఫిక్సయిపోయారు. కానీ 2.0 కంప్లీట్ గా ఫ్రెష్ స్టోరీ అని, అసలు రోబోకి ఈ మూవీకి ఏ సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు శంకర్.