NTR జై లవకుశ సినిమాలో ఇంటరెస్టింగ్ పాయింట్

Monday,September 04,2017 - 01:10 by Z_CLU

జై లవకుశ ఆడియో రిలీజయింది. సందర్భానుసారంగా వచ్చే 4 పాటల్లో ఒక సాంగ్ జై క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తే,  ఇక తక్కిన మూడు పాటలు DSP మార్క్ ని ఎలివేట్ చేస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా NTR ఫ్యాన్స్ లో క్రియేట్ చేసిన డిమాండ్ ని రెండింతలు చేస్తున్నాయి ఈ సాంగ్స్.

ఆడియో రిలీజ్ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో ‘జనతా గ్యారేజ్ తరవాత ఏ సినిమా చేయాలి..? ఇద్దరన్నాదమ్ములం కలిసి చేస్తున్న సినిమా కాబట్టి సరైన కథైతే బావుంటుంది అని ఆలోచిస్తున్న టైమ్ లో బాబీ నాకీ స్టోరీలైన్ చెప్పాడు. అన్నదమ్ములం కలిసి చేస్తున్నందుకు, అందునా అన్నాదమ్ముల రిలేషన్ షిప్ ని ఎలివేట్ చేసే సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాప్పీగా ఉంది’ అని చెప్పుకున్నాడు NTR.

ఈ నెల 21 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా బాబీ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.   NTR సరసన రాశిఖన్నా, నివేత థామస్, హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని NTR ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.