'సర్కారు వారి పాట'... ఇప్పట్లో ఆగేలా లేదు

Monday,June 22,2020 - 11:49 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ‘సర్కారు వారి పాట’ సినిమా చుట్టూ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయ్. సినిమాలో విలన్ రోల్ కోసం రోజుకో నటుడి పేరు తెరపైకి వస్తుంది. ముందుగా కన్నడ స్టార్ ఉపేంద్ర ను తీసుకున్నారనే టాక్ వినిపించింది.  తర్వాత ఆ రోల్ కి సుదీప్ ను ఫిక్స్ చేశారంటూ ప్రచారం జరిగింది.

కట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ కి విలన్ గా అరవింద్ స్వామి అంటూ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా సర్కారువాటి పాట మూవీలో విలన్ పాత్ర కోసం రోజుకో పేరు తెరపైకొస్తోంది.

అయితే సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ డీటెయిల్స్ మినహా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. హీరోయిన్ విషయంలోనూ ఇంతవరకు సినిమా యూనిట్ నుండి అనౌన్స్ మెంట్ రాలేదు. కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూ లో తనే స్వయంగా సినిమా చేస్తున్నట్లు చెప్పుకుంది. దీంతో హీరోయిన్ కన్ఫర్మ్ అనే న్యూస్ బయటికొచ్చింది.

ఇక విలన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే కానీ ఈ గాసిప్స్ కు చెక్ పడదు.