ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఇంటరెస్టింగ్ కాంబో

Monday,February 20,2017 - 12:53 by Z_CLU

 కృష్ణ వంశీ, ప్రకాష్ రాజ్.. ఈ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటిలో కొన్ని కమర్షియల్ ఎంటర్ టైనర్స్ అయితే మరికొన్ని సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేశాయి. ప్రకాష్ రాజ్ కరియర్ లో అవుట్ స్టాండింగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన సముద్రం, అంతఃపురం లాంటి బ్లాక్ బస్టర్స్ ప్రకాష్ రాజ్ ని సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని ఆర్టిస్ట్ గా నిలబెట్టాయి. ఇప్పుడు మళ్ళీ అదే కృష్ణవంశీ డైరెక్షన్ లో అదే రేంజు కాన్సెప్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

మరాఠిలో బ్లాక్ బస్టర్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాని రేమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు క్రియేటివ్ డైరెక్టర్. నానాపటేకర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా మరాఠి సినిమా ఇండస్ట్రీలో మ్యాగ్జిమం అన్ని రికార్డులు బ్రేక్ చేసి పడేసింది. మొన్నటికి మొన్న రిలీజైన ‘సైరత్’ కి ముందు బాక్సాఫీస్ దగ్గర భారీ మొత్తం కలెక్ట్ చేసిన హయ్యెస్ట్ గ్రాసర్  నటసామ్రాట్. ఇప్పుడీ సినిమా తెలుగు రీమేక్ లో ప్రకాష్ రాజ్ నటించబోతున్నాడనే విషయం భారే వైబ్రేషన్స్ నే క్రియేట్ చేస్తుంది.

ఒక మహానటుడి జీవితం, ఏదైనా మొహం మీద చెప్పేసే స్వభావం, తమ భవిషత్తు గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఉన్నదంతా తన పిల్లలకు ధారపోసిన ఓ తండ్రి కథే నట సామ్రాట్. ఒకరిపై ఆధారపడి జీవించాల్సిన వయసులో కన్న బిడ్డలే అవమానిస్తుంటారు. ఒకరోజు కన్న కూతురే తల్లి దండ్రులపై దొంగతనం మోపడంతో ఇంట్లోంచి బయటికి వచ్చేసిన హీరో, అనారోగ్యం పాలైన భార్యను కాపాడుకోలేకపోతాడు. ఉన్న ఒక్క తోడు కూడా దూరమవడంతో హీరో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోతాడు. ఒక చిన్న హోటల్ లో సర్వర్ గా పని చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో తానే మహానటుడు ‘నట సామ్రాట్’ అన్న తన ఉనికిని ఏ మాత్రం బయటపడకుండా మ్యానేజ్ చేస్తుంటాడు. తన చివరి శ్వాస ఉన్నంత వరకు తన రంగ స్థలాన్ని ఒక నటుడు ఎంతలా ప్రేమిస్తాడో సినిమా చివరి దశలోనూ తెలియజేస్తాడు నట సామ్రాట్. ఆఖరికి నటిస్తూనే మరణిస్తాడు.

హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మరాఠి బ్లాక్ బస్టర్ ని తెలుగు నేటివిటీకి, టేస్ట్ కి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్ చేసి ప్రెజెంట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు కృష్ణవంశీ. ఈ సినిమా విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు కానీ, ఇలాంటి డిఫెరెంట్ సినిమా ఈ ఇద్దరిలో కాంబినేషన్ లో రానుందనే టాక్, ట్రేడ్ వర్గాలను కూడా ఎగ్జైట్ చేస్తుంది. మరి సినిమా యూనిట్ దీనిని సెట్స్ పైకి తీసుకు వచ్చే విషయంలో ఏ రేంజ్ లో సక్సీడ్ అవుతుందో చూడాలి.