ఈషా రెబ్బ టైమ్ ఇంకెప్పుడు..?

Tuesday,March 12,2019 - 05:01 by Z_CLU

కొంతమంది హీరోయిన్స్ ఇలా వచ్చి అలా స్టార్స్ అయిపోతుంటారు. కొందరికి అదృష్టం ఎంతలా కలిసొస్తుందంటే వాళ్ళున్న సినిమా సింగిల్ రిలీజైనా చాలు, కొత్తమ్మాయి అని కూడా లేకుండా పాప్యులారిటీ వరించేస్తుంటుంది. కానీ ఈషా రెబ్బ విషయంలో మాత్రం ప్రతీది రివర్సే.  ఎంతగా ట్రై చేసినా ఈషా రెబ్బ విషయంలో టైమ్ కాదు కదా, కథలు కూడా కలిసి రావట్లేదు.

‘అంతకు ముందు ఆ తరవాత’ సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన ఈషా, చేసిన ప్రతి సినిమా కొద్దో గొప్పో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేసిందే. అదేంటో ఆ సినిమాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఈషా రెబ్బ ప్రస్తావన వినబడదు.

రీసెంట్ గా ‘అరవింద సమేత’ లాంటి బ్లాక్ బస్టర్ లో కనిపించిన ఈషా రెబ్బ, ఇక కమర్షియల్ హీరోయిన్ స్టేజ్ కి దగ్గరలో వచ్చేసింది అనుకునే లోపే గ్రాఫ్ మళ్ళీ పడిపోయింది. దాంతో ఫోకస్ ఇతర భాష సినిమాలపై పెట్టింది. గతంలో కూడా తమిళ సినిమాలో లక్ టెస్ట్ చేసుకున్న ఈషా, ఈ ఏడాది కన్నడ సినిమాల్లో ఇంట్రడ్యూస్ కానుంది.

మొదటి నుండి టార్గెట్ స్టార్ హీరోలని పెట్టుకున్న ఈషా బిగినింగ్ నుండి డైరెక్టర్స్ కి ఫేవరేట్ హీరోయినే. కాకపోతే ఫ్యాన్స్ లో క్రేజ్ క్రియేట్ అవ్వడంలోనే లెక్క తప్పుతుంది. ఇప్పటికీ వస్తున్న అవకాశాల్లోంచి బెస్ట్ చూజ్ చేసుకుంటూ, అంతే కాన్ఫిడెంట్ గా, చేసే ప్రతి రోల్ ని 100 % ప్రెజెంట్ చేస్తున్న ఈషా రెబ్బకి టైమ్ ఇంకెప్పుడు కలిసొస్తుందో చూడాలి.