Sasanasabha Trailer: కిక్ ఇచ్చే పొలిటికల్ డ్రామా

Monday,November 28,2022 - 12:06 by Z_CLU

Sasanasabha Trailer Review

ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా సీనియర్ నటుడు డా.రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రల్లో.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘శాసనసభ’.

వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని.. సాబ్రో ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. డిసెంబర్ 16 గ్రాండ్‌గా ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా  గ్రాండ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ వేడుకలో తెలుగు ట్రైలర్‌ను ఏపీ మినిస్టర్ ఆర్.కె. రోజా, కన్నడ ట్రైలర్‌ను తుంగతుర్తి MLA డా. గాధరి కిశోర్ కుమార్, మలయాళం ట్రైలర్‌ను దర్శకుడు-నటుడు చిన్నికృష్ణ, తమిళ ట్రైలర్‌ను ‘నాంది’ సతీష్ విడుదల చేయగా.. టైటిల్ సాంగ్‌ను వైజాగ్ MLC వంశీకృష్ణ యాదవ్ విడుదల చేశారు.

రాజకీయ నాయకులు వారు చేసే రాజకీయాల నేపథ్యంతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ‘శాసనసభ’ ట్రైలర్ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంద్రసేన హీరోయిజం ,  రాజేంద్ర ప్రసాద్ కేరెక్టర్ , డైలాగ్స్, రవి బసృర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ చూస్తే ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చే పొలిటికల్ సినిమా రాబోతుందని అర్థమవుతుంది. ఈ సినిమాకు రాఘవేంద్రరెడ్డి.. కథ-స్క్రీన్ ప్లే-మాటలు అందించారు.

sasanasabha

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics