సెన్సార్ ఫినిష్ చేసుకున్న 'ఇంద్రసేన'
Sunday,November 26,2017 - 09:06 by Z_CLU
తన ప్రతి సినిమాకు ఓ వైవిధ్యమైన కథను ఎంచుకుంటూ తెలుగులో తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన విజయ్ ఆంటోని త్వరలో “ఇంద్రసేన ” గా థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా నవంబర్ 30న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
బ్రదర్ సెంటిమెంట్ నేపధ్యంలో ఇంటెన్స్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన డైనా చంపిక, మహిమా హీరోయిన్స్ గా నటించగా జి.శ్రీనివాసన్ దర్శకత్వం వహించారు. నీలం లక్ష్మి సమర్పణలొ నీలం కృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.