

Tuesday,September 07,2021 - 01:40 by Z_CLU
తెలుగు అమ్మాయి షణ్ముఖ ప్రియ ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనలిస్టులలో ఒకరు. ఇటీవల ఆమె అభిమాన నటుడు విజయ్ దేవరకొండ తనకు శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఆమె ఒకరకమైన సంబ్రమాశ్చర్యాలకు లోనైంది. ఆ సమయంలో తన తదుపరి చిత్రంలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ.
ఇప్పుడు విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పూరిజగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ `లైగర్`లో షణ్ముఖ ప్రియతో ఒక పాట పాడించడం ద్వారా తన వాగ్దానాన్ని నెరవేర్చుకున్నారు విజయ్ అలాగే షణ్ముఖ ప్రియ కల కూడా సాకారం అయ్యింది.
అంతేకాకుండా షణ్ముఖ ప్రియ మరియు ఆమె తల్లిని తన నివాసంలో కలిశారు విజయ్. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తల్లి షణ్ముఖ ప్రియను సత్కరించారు. అలాగే ఆమెకు కొన్ని బహుమతులు అందజేశారు.
మేము నీ పాటను సినిమాలో ఉంచుతాము. అది ఒక చక్కని పాట. దానిని వినడానికి ఎదురు చూస్తున్నాను. వచ్చే వారం వింటానని అనుకుంటున్నాను. తొందరగా ఫైనల్ మిక్సింగ్‌కి పంపమని వారిని అడుగుతాను ”అని విజయ్ దేవరకొండ షణ్ముఖ ప్రియకు చెప్పారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మోహతా నిర్మిస్తున్నారు.
విలక్షణ నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రధారి.
‘లైగర్’ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు
విజయ్‌దేవరకొండ, అనన్యాపాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శీను
సాంకేతిక నిపుణులు
డీఓపీ: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ భాష
ఎడిటర్: జూనైద్ సిద్ధిఖీ
స్టంట్ డైరెక్టర్: అండీ లాంగ్
Thursday,August 24,2023 07:36 by Z_CLU
Tuesday,August 22,2023 12:43 by Z_CLU
Friday,August 18,2023 03:55 by Z_CLU
Friday,August 18,2023 10:06 by Z_CLU