మరికొన్ని గంటల్లో...

Monday,March 20,2017 - 11:47 by Z_CLU

మరికొన్ని గంటల్లో సోషల్ మీడియాలో రెండు ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్  స్పేస్ చేసుకోబోతున్నాయి.  మోహన్ లాల్ తో  పాటు, అల్లు శిరీష్ నటించిన 1971 – భారత సరిహద్దు టీజర్, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది. దీంతో పాటు వెంకటేష్ నటించిన స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గురు ట్రేలర్ కూడా ఈ రోజే రిలీజవుతుంది.

1971 సినిమాతో మలయాళం లోను ఇంట్రడ్యూస్ కానున్న అల్లు శిరీష్ ఈ సినిమాలో మిలిటరీ సైనికుడిగా నటించాడు. మోహన్ లాల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మేజర్ రవి డైరెక్షన్ లో తెరకెక్కింది. 1971 లో జరిగిన యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడంతో టాలీవుడ్ లో ఇప్పటికే ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ ఉంది.

మరోవైపు వెంకీ ‘గురు’ కూడా రోజు రోజుకి పాజిటివ్ బజ్ ని బ్యాగ్ లో వేసుకుంటుంది. వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా నటించిన ఈ సినిమా సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కింది. ఈ అల్టిమేట్ మాస్ ఎంటర్ టైనర్ టీజర్ రిలీజైనప్పుడే మ్యాగ్జిమం అటెన్షన్ ని గ్రాబ్ చేసింది. ఈ రోజు 8:30 కి రిలీజ్ కానున్న ట్రేలర్ కూడా అంతే ఎగ్జైట్ మెంట్ ని క్రియేట్ చేస్తుంది.