మరికొన్ని గంటల్లో...

Tuesday,May 30,2017 - 12:35 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ టీజర్ రిలీజ్ కి ఇంకా జస్ట్ కొన్ని గంటలే ఉన్నాయి. రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కాబోయే ఈ స్పైడర్ ఫీవర్ అప్పుడే సోషల్ మీడియాలో రేజ్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ ఫస్ట్ లుక్స్, డిఫెరెంట్ టైటిల్ తో ఇప్పటికే ఫ్యాన్స్ లో ఓ రేంజ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసిన సినిమా యూనిట్, టీజర్ ని కూడా అంతే స్టైలిష్ గా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.  ఏది ఏమైనా ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి ఏ మాత్రం హడావిడి లేకుండా, ప్రొడక్షన్ పైనే కాన్సంట్రేట్ చేసిన ‘స్పైడర్’ టీమ్, మెల్లిగా ‘స్పైడర్’ ఫీవర్ ని స్ప్రెడ్ చేసే ప్రాసెస్ లో ఉంది.

AR మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘స్పైడర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాతో కోలీవుడ్ లోను గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ ‘స్పైడర్’ ని దసరా కల్లా థియేటర్స్ లోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు ఫిలిం మేకర్స్.