మరి కొన్ని గంటల్లో...

Thursday,April 27,2017 - 11:38 by Z_CLU

సాహో టీజర్ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. సాయంత్రం 5:30 కి సోషల్ మీడియాలో రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్, బాహుబాలి 2 సినిమాతో పాటు వరల్డ్ వైడ్ గా ప్రతి థియేటర్ లో ప్రదర్శించబడుతుంది. అల్టిమేట్ యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది. దుబాయ్ లోని రేర్ లొకేషన్స్ లో తెరకెక్కనున్న సాహో సినిమా UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది. ‘ట్రాన్స్ ఫార్మర్స్’ లాంటి సినిమాలకు యాక్షన్ కోరియోగ్రఫీ చేసిన హాలీవుడ్ యాక్షన్ స్టంట్ మాస్టర్ కెన్ని బేట్స్ ఈ సినిమాకి పని చేయనున్నాడు.