నాకు నచ్చితేనే...

Saturday,October 08,2016 - 07:00 by Z_CLU

కీర్తి సురేష్ గుర్తుందా… రామ్ నటించిన నేను శైలజ సినిమాతో తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకుంది. అప్పటికే తమిళ్ లో కూడా క్రేజీ హీరోయిన్ ఆమె, అయితే నేను శైలజ సక్సెస్ తర్వాత కీర్తి సురేష్ కు టాలీవుడ్ నుంచి ఆఫర్లు బాగానే వచ్చాయి. అయితే ఈ ముద్దుగుమ్మ వాటిని లెక్కచేయలేదు. తనకు నచ్చిన సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వస్తోంది. ఇందులో భాగంగా నాని సరసన నేను లోకల్ అనే సినిమా చేస్తోంది.

                           తాజాగాా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనసులో మాట బయటపెట్టింది కీర్తి సురేష్. స్కిన్ షో చేసే ఎలాంటి పాత్రలు ఒప్పుకోనని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఏమాత్రం ఎక్స్ పోజింగ్ ఉన్న పాత్రకూ అంగీకరించనని, కేవలం సంప్రదాయబద్ధంగా ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానంటోంది. గ్లామర్ పాత్రలకు నో అంటోంది కాబట్టే కీర్తి సురేష్ కు తెలుగులో అవకాశాలు అంతంతమాత్రంగా వస్తున్నాయనే టాక్ ఉంది.