ఇలియానా ఇంటర్వ్యూ

Monday,November 12,2018 - 02:01 by Z_CLU

నవంబర్ 16 న రిలీజ్ అవుతుంది అమర్ అక్బర్ ఆంటోని. లాంగ్ గ్యాప్ తరవాత ఈ సినిమా ద్వారా మళ్ళీ తెలుగు తెరపైకి వస్తుంది ఇలియానా. ఈ సందర్భంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, అమర్ అక్బర్ ఆంటోని విషయాలు చెప్తూనే, తన కరియర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్  చేసింది. ఆ విషయాలు మీ కోసం…

సినిమా చేయడానికి రీజన్..

ఈ సినిమా చేయడానికి వరసగా చాలా రీజన్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ రవితేజ నా ఫేవరేట్ కో స్టార్… శ్రీను వైట్ల… వీళ్ళందరూ ఉన్నా కూడా స్టోరీ నచ్చింది కాబట్టి ఈ సినిమా చేశాను.

సినిమాలో నా క్యారెక్టర్…

ఈ సినిమాలో నా రోల్ గురించి ఇప్పుడే రివీల్ చేయలేను. చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాను. చాలా లేయర్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో నా పేరు కూడా ఇప్పుడు రివీల్ చేయలేను…  ప్రస్తుతానికి మిస్టరీనే…

ఇంకా చెప్పాలంటే…

పర్ఫామెన్స్ కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్.. చాలా ఇమోషనల్ గా ఉంటుంది. అందరూ కలిసి చూడదగ్గ సినిమా అమర్ అక్బర్ అంటోని. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

పక్కా ప్లాన్డ్..

జెనెరల్ గా సినిమా ట్రైలర్ చూడగానే, ఆ సినిమా ఎలా ఉండబోతుంది. స్టోరీ ఏమై ఉంటుందనేది కొద్దో గొప్పో రివీల్ అయిపోతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించి ఏదీ రివీల్ చేయకూడదు అనుకున్నాం,  ట్రైలర్ చూస్తే అమర్ అక్బర్ ఆంటోని గురించి ఇంకా క్యూరియాసిటీ కలుగుతుంది తప్ప, స్టోరీ ఏంటనేది అర్థం కాదు.. ఇదంతా ప్లాన్డ్ గా చేశాం.

అలా జరిగింది…

త్రివిక్రమ్ గారి ‘జులాయి’ సినిమా చేస్తున్నప్పుడు నాకు  బాలీవుడ్ లో   ‘బర్ఫీ’ ఆఫర్ వచ్చింది.  అప్పుడే త్రివిక్రమ్ గారికి కూడా చెప్పాను. ఆయన స్టోరీలైన్ వినగానే చేసేయమని చెప్పారు. అప్పటికీ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది కూడా నాకు తెలీదు అయినా స్టోరీ బావుందని చేసేశాను.

ఆ తరవాత…

‘బర్ఫీ’ తరవాత ఒక సినిమా తరవాత ఒకటి వరసగా చేసుకుంటూ వెళ్లాను. ఈ లోపు టాలీవుడ్ లో గ్యాప్ రావడం, దానికి తోడు నేను టాలీవుడ్ సినిమాలు చేయదలుచుకోలేదని రూమర్స్ క్రియేట్ అయ్యాయి… నిజానికి నేనెప్పుడూ తెలుగు సినిమాలు చేయకూడదు అని అనుకోలేదు…

అప్పుడు- ఇప్పుడు…

అప్పటి ఇలియానాకి, ఇప్పటి ఇలియానాకి డెఫ్ఫినేట్ గా చాలా ఎదిగాను. అప్పుడు నేనింకా చిన్నపిల్లనే. ఇంత ఎక్స్ పీరియన్స్ లేదు. ఇప్పుడు నాకు 32 ఏళ్ళు. కాబట్టి అప్పటి ఇలియానాకి ఇప్పటి ఇలియానాకి చాలా డిఫెరెన్స్ ఉంటుంది.

అదే తేడా…

ఇప్పుడున్నంత మెచ్యూరిటీ నాకప్పుడు లేదు. ఎంత ఇన్నోసెంట్ అంటే నేను ‘పోకిరి’ కూడా చేయను అని చెప్పాను. అప్పుడు మంజుల గారు నాతో మాట్లాడి, ఆ సినిమా చేసేలా చేసారు. డెఫ్ఫినేట్ గా కరియర్ బిగినింగ్ లో కొన్ని తప్పులు చేశాను. కానీ చాలా నేర్చుకున్నాను.

నేనసలు ఒప్పుకోలేదు…

ఎప్పుడైతే ఈ సినిమాకి నన్ను డబ్బింగ్ చెప్పమన్నారో అసలు నేనొప్పుకోలేదు. హైదరాబాద్ కి వచ్చినప్పుడు కూడా అనుమానంగానే వచ్చాను. బిగినింగ్ లో అయితే డైలాగ్స్ చెప్తుంటే చెమటలు పట్టేసేవి.. కానీ ఆ తరవాత అలవాటైనట్టనిపించింది.జస్ట్ 3 రోజుల్లో డబ్బింగ్ కంప్లీట్ చేసేశాను. మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను.

ఐ హేట్ మై వాయిస్…

నా వాయిస్ నాకే నచ్చదు. అందునా తెలుగు సరిగ్గా పలకగలనా అనే భయం నాకు లోపల్లోపల ఉండేది. అందుకే నో అని చెప్పాను. కానీ నా కన్నా శ్రీనునే నా వాయిస్ ని నాకన్నా ఎక్కువగా నమ్మాడు. చాలా హ్యాప్పీ…

డైరెక్టర్స్ అడిగితే….

ఫ్యూచర్ సినిమాల్లో డబ్బింగ్ చెప్తానా లేదా అన్నది నిజంగా నాకు తెలీదు, ఒకవేళ నా డైరెక్టర్స్ అడిగితే తప్పకుండా చెప్తాను.

నేను విధినే నమ్ముతా..

టాలీవుడ్ లో ఇంత పెద్ద గ్యాప్ వస్తుందని అనుకోలేదు, నేను ప్లాన్డ్ గా చేసింది కూడా ఏమీ లేదు. నేను ఈ విషయంలో విధినే నమ్ముతాను. ఏది జరిగినా మన మంచికే అని నా ఫీలింగ్…

అందుకే నో అని చెప్పా…

నాకు తెలుగులో కొన్ని ఆఫర్స్ వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది. ఎంత పెద్ద స్టార్ అయినా, స్టోరీ బావున్నా, అందులో నా క్యారెక్టర్ మరీ ఇంపార్టెన్స్ లేకుండా ఉండటంతో వదులుకోవాల్సి వచ్చింది.

సోలో హీరోయిన్ సినిమాలు…

ఏ డైరెక్టర్ అయినా ఈ సినిమా నేను చేయగలను, ఆ రోల్ కి నేను పర్ఫెక్ట్ అని నమ్మితే డెఫ్ఫినేట్ గా ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తాను.

నేను జస్ట్ యాక్టర్…

నాకు సెలెబ్రిటీ, స్టార్ అనే పదాలు ఆసలు నచ్చవు. నేను చాలా నార్మల్ పర్సన్ ని. నేను ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను… మన చుట్టూ చాలా మంది ట్యాలెంటెడ్ పీపుల్ ఉన్నారు, అయినా మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వస్తుంది కాబట్టి థాంక్ ఫుల్ గా ఉంటాను అంతే…

సోషల్ మీడియా వల్ల…

అందరితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వగలిగే ప్లాట్ ఫామ్. సోషల్ మీడియా వల్ల మనం ఎగ్జాక్ట్ గా ఏంటనేది అందరికీ తెలుస్తుంది. మన మనసులోని ఫీలింగ్స్ ఇక్కడ స్ట్రేట్ గా షేర్ చేసుకోవచ్చు.