బాలూ త్వరగా ఇంటికి రా

Saturday,August 15,2020 - 01:28 by Z_CLU

సౌత్ సంగీతంలో బాలసుబ్రమణ్యం, ఇళయరాజా కాంబినేషన్ ఓ మేలిమలుపు. వాళ్లదొక సువర్ణ అధ్యాయం. మ్యాస్ట్రో సంగీతానికి బాలు స్వరం తోడైతే పాట వీనులవిందు అవ్వాల్సిందే.

ఈ స్వరం-సంగీతం కేవలం వెండితెరకు మాత్రమే పరిమితం కాదు. రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరూ ఆప్తమిత్రులు. 5 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఒకరికి కష్టమొస్తే మరొకరు తోడుగా నిలిచారు. ఆనందాన్ని కలిసి ఆస్వాదించారు. ఒకరి బాధను ఇంకొకరు అర్థంచేసుకున్నారు.

అలాంటి ప్రాణస్నేహితుల్లో ఇప్పుడు ఒకరికి కష్టమొచ్చింది. దీంతో మరో ప్రాణం చలించిపోయింది. కరోనాతో బాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని డాక్టర్లు ప్రకటించారు.

దీంతో ఇళయరాజా చలించిపోయారు.. తొందరగా తిరిగిరా బాలూ అంటూ భావోద్వేగంతో ఓ పోస్ట్ పెట్టారు. పరిశ్రమలో బాలూను ఏరా అని పిలిచే ఇద్దరుముగ్గురు వ్యక్తుల్లో ఇళయరాజా ఒకరు.