'ఇది మా ప్రేమ కథ' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Saturday,July 21,2018 - 10:30 by Z_CLU

సూపర్ హిట్ రొమాంటిక్ మూవీ – ఇది మా ప్రేమకథ

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మీ ‘జీ సినిమాలు’ ఛానెల్ లో..

ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి. అలాంటి కథలతో తీసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. కానీ ప్రతి ప్రేమకథకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ఓ ప్రత్యేకమైన ప్రేమకథే “ఇది మా ప్రేమకథ”. ఇది చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథ కాదు. మనసుకు హత్తుకునే మధురమైన ప్రేమగాథ.

జీ తెలుగు ఛానెల్ ద్వారా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ రవి, ఈ ప్రేమకథలో హీరో. కల్యాణ వైభోగం సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన మేఘన లోకేష్ ఈ సినిమాలో హీరోయిన్. వీళ్లిద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. వీళ్లకే కాదు, దర్శకుడు అయోధ్య కార్తీక్ కు కూడా ఇదే తొలి సినిమా. అలా కొత్త తరం హీరోహీరోయిన్లు, దర్శకులతో కలర్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది ఇది మా ప్రేమకథ.

మనసుకు హత్తుకునే ఈ మధురమైన ప్రేమకథను ఈరోజు, రాత్రి 8 గంటలకు, మీ జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ ఛానెల్స్ లో చూసి ఎంజాయ్ చేయండి.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే అందమైన ప్రేమకథ ఇది. అరుణ్ అనే యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రాడిలా రవి కనిపిస్తాడు. అదే కాలేజ్ లో చదువుకుంటుంది సంధ్య (మేఘన). వీళ్లిద్దరి కలయిక చాలా విచిత్రంగా జరుగుతుంది. ఒకరికొకరు పరిచయమైన విధానం కూడా అంతే గమ్మత్తుగా ఉంటుంది. అలా ప్రేమలో పడిన ఈ జంట, ఫైనల్ గా కలిసిందా లేదా..? వీళ్ల ప్రేమకు పరిస్థితులే అడ్డంకిగా ఎలా మారాయి? అనే విషయాలు తెలియాలంటే జీ సినిమాలు ఛానెల్ లో ప్రసారమయ్యే ‘ఇది మా ప్రేమకథ’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ చూడాల్సిందే.

ప్రభాస్ శీను, ప్రియదర్శి, తులసి, వైజాగ్ ప్రసాద్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సింగర్ కమ్ కంపోజర్ కార్తీక్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో పాటలన్నీ క్యాచీగా హమ్మింగ్ గా ఉంటాయి.

వీకెండ్ ను మరింత మెమొరబుల్ గా మార్చుకోండి.

ఇది మా ప్రేమకథ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఈరోజు (జులై 21), రాత్రి 8 గంటలకు మీ ఫేవరెట్ జీ సినిమాలు, జీ సినిమాలు హెచ్ డీ మూవీ ఛానెల్స్ లో..