Varun Tej Ghani బన్నీ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్

Tuesday,March 29,2022 - 11:37 by Z_CLU

Icon Star Allu Arjun to grace the Grand Pre-Release of ‘Ghani’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’ సినిమా ఏప్రిల్ 8న గ్రాండ్ గా రిలీజవుతోంది. రిలీజ్ కి పది రోజులే ఉండటంతో సినిమా ప్రమోషన్స్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు టీం. ఇందులో భాగంగా ఏప్రిల్ 2 న వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు.

ఈ ఈవెంట్ లో స్పెషల్ గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎటెండ్ అవ్వనున్నాడు. ఈ విషయాన్ని తాజాగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మేకర్స్. వరుణ్ తేజ్ హీరో , పైగా అన్నయ్య బాబీ తొలిసారి నిర్మిస్తున్న సినిమా కావడంతో తన ఫ్యామిలీ కోసం ఈ ఈవెంట్ కి హాజరై బజ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు బన్నీ.

‘పుష్ప’ రిలీజ్ తర్వాత బన్నీ మీడియా ముందుకు రాలేదు. ఎలాంటి ఈవెంట్ కి ఎటెండ్ అవ్వలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ‘గని’ ఈవెంట్ కి వస్తుండటంతో బన్నీ సినిమా ప్రమోషన్స్ కి స్పెషల్ ఎట్రాక్షన్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. మరి బన్నీ తన అన్నయ్య గురించి అలాగే వరుణ్ గురించి ఎలాంటి స్పీచ్ ఇస్తాడో సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతాడో చూడాలి.

వరుణ్ తేజ్ సరసన సయి మంజ్రేఖర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.  అల్లు బాబీ , సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics