18Pages మీ హార్ట్ కి టచ్ అయ్యే సినిమా
Tuesday,December 20,2022 - 01:15 by Z_CLU
“18పేజెస్ సినిమాకి ఆ టీం పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుందని 18 పేజీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అల్లు అర్జున్ అన్నారు.
నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్య ప్రతాప్ దర్శకత్వంలో “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” (18Pages) క్రిస్టమస్ కానుకగా డిసంబర్ 23న రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ… ” నా ఫెవరెట్ పీపుల్ చేసిన సినిమా ఇది. నేనెప్పుడూ అనుకుంటాను, సుకుమార్ లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు థాంక్యూ సో మచ్ డార్లింగ్. నా క్లోజ్ పర్సన్ వాసు, వాసు నాకు ఎంత క్లోజ్ అంటే వాసు పేరు లో నా పేరు ఉంటుంది. ఇక మా నాన్నగారు సొంత ఓటిటి ఛానల్ ఉన్నప్పటికీ ఈ సినిమాను థియేటర్ లోనే రిలీజ్ చేయాలనుకోవడం ఆయనకు థియేటర్ మీద ఉన్న ఇష్టం. ఒక ప్రొడ్యూసర్ గా ఆయనకి సినిమా అంటే లవ్ అందుకే ఆయనకి నా రెస్పెక్ట్.
గోపి సుందర్ గారు మ్యూజిక్ చాలా బాగుంది, మనం త్వరలో కలిసి పనిచెయ్యాలనుకుంటున్నా,ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ కి ఆల్ ది బెస్ట్. ప్రతాప్ ను ఆర్య సినిమా నుంచి చూస్తున్నాను. కుమారి 21 తర్వాత ఇస్తే మంచి సినిమానే ఇవ్వాలి అని వెయిట్ చేసి మరీ సినిమా చేశాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
కార్తికేయ తో హిట్ కొట్టిన నిఖిల్ కి కంగ్రాట్స్. నిఖిల్ మంచి కాన్సప్ట్ సినిమాలు చేస్తాడు. అలానే చాలా పుస్తకాలు చదువుతాడు అది ఒక యాక్టర్ కి ఉండాల్సిన మంచి క్వాలిటీ. ఈ సినిమా మూడేళ్ల తరువాత రిలీజ్ అవుతుంది, ఈ సినిమాకి వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ మీ హార్ట్ కి టచ్ అవుతుంది. ఈ సినిమాను ఖచ్చితంగా చూడండి..” అన్నారు.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics