Allu Arjun తమ్ముడి కోసం అన్నయ్య !

Saturday,November 05,2022 - 04:44 by Z_CLU

తాజాగా రిలీజైన అల్లు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ (UrvasivoRakshasivo) సూపర్ హిట్ టాక్ అందుకుంది. యూత్ ఫుల్ కంటెంట్ తో రాకేశ్ శశి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ 2 బేనర్ పై తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.  సినిమాలో సునీల్ , వెన్నెల కిషోర్ కామెడీ కూడా క్లిక్ అయింది. వారిద్దరి ట్రాక్ ప్రేక్షకులను హిలేరియస్ గా నవ్విస్తుంది. ఈ సందర్భంగా రేపు సాయంత్రం సినిమాకు సంబంధించి సక్సెస్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ జే ఆర్సీ లో ఈవెంట్ జరగనుంది.

ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ హీరోగా సినిమా చేశాడు. కొన్నేళ్లుగా సక్సెస్ అందుకోవడానికి ట్రై చేస్తున్న శిరీష్ ఎట్టకేలకు ‘ఊర్వశివో రాక్షసివో’ తో సూపర్ హిట్ అందుకున్నాడు. రేపు తమ్ముడి సక్సెస్ గురించి బన్నీ ఈవెంట్ లో మాట్లాడనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి బన్నీ ఇంత వరకూ కనీసం సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టలేదు. ఈ నేపథ్యంలో మరి రేపు తమ్ముడి గురించి, అలాగే ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా గురించి బన్నీ ఏం మాట్లాడతాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ ఊహించిన స్థాయిలో లేవు. రేపు బన్నీ ఈవెంట్ తో వసూళ్ళు ఊపందుకుంటాయేమో చూడాలి.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics